Monday, September 24, 2012

టాలీవుడ్‌లో మళ్లీ అదే ట్రెండ్



ఇప్పుడు టాలీవుడ్ ట్రెండ్ మార్చింది. ఒకప్పుడు వరుసగా సోషియో ఫాంటసీ సినిమాలు చేసిన టాలీవుడ్ ఇప్పుడు మళ్లీ సోషియో ఫాంటసీ చిత్రాలపై దృష్టిపెట్టింది. టాలీవుడ్ అగ్రహీరో నాగార్జున  కెరీర్ లోనే  తొలిసారిగా  సోషియో ఫాంటసీ చిత్రం చేస్తున్నాడు. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో నాగ్ హీరోగా 'డమరుకం' దసరా కానుకగా  ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  ఈ మూవీ పై  ఇటు ఇండస్ర్టీలోని  అటు  ప్రేక్షకులలోను భారీ అంచనాలు నెలకొన్నాయి.

మెగాస్టార్ చిరంజీవి సోషియోఫాంటసీగా చేసిన మూవీ 'యముడికి మొగుడు' అప్పట్లో సూపర్ హిట్టయింది. తాజాగా అదే టైటిల్ తో అల్లరి నరేష్ ఓ సోషియో ఫాంటసీ చిత్రానికి శ్రీకారం చుట్టాడు. అల్లరి నరేష్ కెరీర్ లోనూ ఇదే తొలి సోషియో ఫాంటసీ మూవీ. హీరో శ్రీకాంత్ కూడా సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నాడు. శ్రీకాంత్ డ్యుయల్ రోల్ చేస్తున్న  సోషియో ఫాంటసీ చిత్రం 'దేవరాయ'.  దేవరాయలు కాలంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సోషియో ఫాంటసీ మూవీ అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

తారకరత్న తొలిసారిగా  సోషియో ఫాంటసీ చిత్రంలో నటిస్తున్నాడు. ఆ చిత్రంలో తారక్ యమధర్మరాజు పాత్రలో కనిపించనున్నాడు. వెంకట్ పంపన దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈచిత్రాన్ని నందన్ గౌడ్  నిర్మిస్తున్నారు .. ఈ చిత్రం విజయదశమి రోజున ప్రారంభకానుంది. తమిళ దర్శకుడు టి .రాజేంవూదన్  తెలుగులో ఓ సోషియో ఫాంటసీ చిత్రానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇలా టాలీవుడ్ లో ఇప్పుడు సోషియో ఫాంటసీ చిత్రాల హవా వీస్తోంది. మరి ఈ సినిమాలు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటాయో కొద్ది రోజుల్లోనే తేలబోతోంది.

ads

Ditulis Oleh : GMRaju Hari: 5:55 AM Kategori:

0 comments:

Post a Comment