30న సాగరహారం: కోదండరామ్ హెచ్చరిక: హైదరాబాద్: ఈ నెల 30వ తేదీ లోపల తెలంగాణపై ప్రకటన వెలువడకపోతే ట్యాంక్ బండ్ పై తెలంగాణ మార్చ్ నిర్వహిస్తామని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ హెచ్చరించారు. ఈ మార్చ్ కు 'సాగరహారం' అని నామకరణం చేశారు. ఆ రోజున తెలంగాణవాదులు ట్యాంక్ బండ్, నక్లెస్ రోడ్డుపైకి తరలిరావాలని పిలుపు ఇచ్చారు. సాగర హారంలో పాల్గొనేవారు తమతో ఆహారం కూడా తెచ్చుకోవాలని కోరారు. భవిష్యత్ లో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ మార్చ్ ను శాంతియుతంగా నిర్వహిస్తామన్నారు. మార్చ్ ను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుంటిసాకులు చెపుతోందన్నారు.
హోంమంత్రి సబితను ఈ రాత్రి 7:30 గంటలకు కలుస్తామని చెప్పారు. తెలంగాణ కవాతుపై లేఖ ఇస్తామన్నారు. 29లోపు తెలంగాణపై ప్రకటన వచ్చేలా చూడండి, లేకుంటే 30న జరిగే తెలంగాణ మార్చ్ లో పాల్గొనాలని తెలంగాణ మంత్రులకు కోదండరామ్ పిలుపు ఇచ్చారు. మాతో వస్తారా? లేక తెలంగాణ ద్రోహులుగా మిగులుతారా? తెలంగాణ మార్చ్ మీకొక డెడ్ లైన్ అని తెలంగాణ మంత్రులను కోదండరామ్ హెచ్చరించారు.

0 comments:
Post a Comment