డీజిల్ ధర పెంపు కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచవలసి వచ్చిందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చార్జీల పెంపు బాధాకరమే అయినా పెంచక తప్పలేదని అన్నారు. ఆర్టీసీ సంస్థపై ఆర్థిక భారం తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని సత్తిబాబు వివరణ ఇచ్చారు.
పెరిగిన బస్సు చార్జీలపై సోమవారం బొత్స మీడియాతో మాట్లాడుతూ డీజిల్ ధర ఒక రూపాయి పెరిగితే సంస్థపై రూ. 65 కోట్ల భారం పడుతుందని, ప్రస్తుతం డీజిల్ ధర పెంపు కారణంగా సంస్థపై రూ. 330 కోట్ల భారం పడుతుందని బొత్స వివరించారు. ఆర్టీసీ ఏడాదికి 56 వేల కోట్ల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తున్నట్లు చెప్పారు. రాబోయే కాలంలో సంస్థ మనుగడను దృష్టిలో ఉంచుకుని బస్సు చార్జీలు పెంచినట్లు బొత్స వివరించారు.
పెంచిన ఆర్టీసీ చార్జీలపై ప్రజలు పెద్ద మనసుతో ఆలోచించాలని బొత్స కోరారు. ఆర్టీసీ సంస్థ అభివృద్ధిని రాజకీయ పార్టీలు కూడా అర్ధం చేసుకోవాలని సూచించారు. చార్జీల పెంపుపై రాజకీయం చేయడం తగదని అన్నారు. ఎప్పుడూ లేని విధంగా రూ. 200 కోట్లు బడ్జెట్‌లో ఆర్టీసీకి కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది రెండువేల కొత్త బస్సులను కొనుగోలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించినట్లు బొత్స తెలిపారు.


0 comments:
Post a Comment